మదర్స్ డే నాడు.. ఎమోషనల్ ట్వీట్ చేసిన చిరంజీవి

by Hamsa |
మదర్స్ డే నాడు.. ఎమోషనల్ ట్వీట్ చేసిన చిరంజీవి
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆయన ఫ్యామిలీతో సమయం గడుపుతూ ఫుల్ బిజీగా మారిపోయారు. అలాగే పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్‌‌లో గెలిపించాలని కోరుతూ వీడియోలు, పోస్టులు పెడుతున్నాడు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్‌కు సపోర్ట్‌గా ఉంటున్నారు.

అయితే చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేయాల్సి ఉండగా.. ఆకరి నిమిషంలో తాను రావట్లేదని తెలిపి అందరికీ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం చిరంజీవి తమ్ముడు గెలిపించాలనే ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. నేడు మదర్స్ డే కావడంతో చిరు తన తల్లిపై ఉన్న ప్రేమను తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘‘జన్మనిచ్చి, పెంచి, పోషించిన అమ్మకి ఈ ఒక రోజు ఏంటి .. ప్రతి రోజు అమ్మదే.. ఈ జీవితమే అమ్మది. హ్యాపీ మదర్స్ డే’’ అని రాసుకొచ్చాడు. అలాగే తల్లి అంజనమ్మ, భార్య సురేఖ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed