చిరంజీవితో విజయశాంతి స్టెప్పులు.. 30 ఏళ్ల తర్వాత అభిమానులకు ఫుల్ మీల్స్..

by Dishafeatures3 |
చిరంజీవితో విజయశాంతి స్టెప్పులు.. 30 ఏళ్ల తర్వాత అభిమానులకు ఫుల్ మీల్స్..
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి - లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్ లో సినిమాలు అంటే థియేటర్స్ హౌస్ ఫుల్ అయిపోయేవి. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు ఇరవైకి పైగా సినిమాలు రాగా ఆల్మోస్ట్ అన్నీ సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యాయి. చిరుతో విజయశాంతి స్టెప్స్ కోసం మ్యూజిక్ కంపోజర్స్ కూడా జాగ్రత్తలు తీసుకుని మరీ ట్యూన్స్ ఇచ్చేవారట. ఫ్యాన్స్ చిందులు వేసేవారట. అయితే ఈ జంట మరోసారి తెరపై సందడి చేయబోతుందని తెలుస్తుంది. చిరు అప్ కమింగ్ ఫిల్మ్ విశ్వంభరలో విజయశాంతి కీలకపాత్రలో కనిపించనుందని టాక్.


ఇప్పటికే ఆమెతో ఈ టీమ్ సంప్రదింపులు జరుపుతుందని.. త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే దాదాపు 30ఏళ్ల తర్వాత తమ అభిమాన జోడిని తెరపై చూసుకోనున్నారు అభిమానులు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. మేము అయితే థియేటర్ లో ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఎంజాయ్ చేసేందుకు రెడీ అంటున్నారు ఫ్యాన్స్.



Next Story

Most Viewed