మెగా వారసురాలు పుట్టింది ఏ టైం.. ఆమె జాతకం గురించి చిరంజీవి ఎమోషనల్ స్పీచ్

by Hamsa |   ( Updated:2023-06-20 08:40:17.0  )
మెగా వారసురాలు పుట్టింది ఏ టైం.. ఆమె జాతకం గురించి చిరంజీవి ఎమోషనల్ స్పీచ్
X

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఆడ బిడ్డ పుట్టడంతో మెగా స్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మనవరాలిని చూసేందుకు వెళ్లిన చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. మా ఇంట్లో వరుణ్, లావణ్య ఎంగేజ్‌మెంట్, రామ్ చరణ్ కు పాప పుట్టడం అన్ని శుభాలు, కార్యాలు జరుగుతుండటం వల్ల చాలా చాలా సంతోషంగా ఉంది. దానికి మా మనవరాలు ముఖ్య కారణమని నేను అనుకుంటున్నాను. పాప పోలికలు ఎవరివని అడగ్గా.. ఇంకా ఎవరివని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. మంగళవారం అంటే ఆంజనేయ స్వామిని నమ్ముకున్న మా కుటుంబం అదే రోజు ఆడ బిడ్డ పుట్టడం అనేది మాకు ప్రసాదించిన వరంగా అపురూపంగా భావిస్తున్నాము. ఈ రోజు ఉదయం 1 గంట 49 నిమిషాలకు రామ్ చరణ్- ఉపాసన ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. కొన్నేళ్లుగా మేము వాళ్లిద్దరూ తల్లిదండ్రులు కావాలని కోరుకుంటున్నాము. మా చేతిలో బిడ్డను పెట్టాలని అనుకున్నాము అది ఇన్నేళ్ల తర్వాత నెరవేరింది. అందరి ఆశీస్సుల వల్ల, అభిమానుల శుభాకాంక్షలు తెలుపుతున్న వారికి మా కుటుంబం తరపున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పాప పుట్టింది మంచి ఘడియలని పెద్దలు అంటున్నారు. అలాగే ఆ పాప జాతకం కూడా బాగుంది కాబట్టి మాకు మంచే జరుగుతుందని భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

Read more:

రామ్ చరణ్ సతీమణి ఉపాసన 9 నెలలు గడవక ముందే తల్లి అయిందా?

మెగా ఫ్యామిలీలో అందరికీ మొదట అమ్మాయిలే జన్మిస్తున్నారా.. తెరపై కొత్త సెంటిమెంట్?

Advertisement

Next Story