- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chiranjeevi కు నేను హార్డ్‌కోర్ అభిమానిని: Star Director
దిశ, సినిమా: 'వాల్తేరు వీరయ్య' సినిమాకు సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయింది. సరిగ్గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు కొన్నిరోజుల ముందు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం కాస్త కొత్తదనమే. ఇందులో భాగంగా దర్శకుడు బాబీ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాబీ మాట్లాడుతూ.. 'నేను 2002లో చిరంజీవి ఒక 20 మంది సభ్యులతో కలిసి గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో అభిమానిగా కలిశాను. మొదట చిరంజీవి అభిమానుల బృందంతో గ్రూప్ ఫొటోకి ఫోజులిచ్చారు. తర్వాత నాకు సోలో చిత్రం కోసం మళ్లీ క్యూలో నిలుచున్న. అయితే నా వంతు వచ్చింది. నన్ను పట్టుకుని రెండు ఫొటోలకు ఫోజులిచ్చాడు. కానీ, అందులో కోపంగా ఫొజులిచ్చాడు. ఇప్పటికి చూసుకుంటే కొంచెం నవ్వితే బాగుండు అనిపిస్తుంది. చూసుకున్నప్పుడల్లా బాధపడతాను. ఎందుకంటే నేను హార్డ్‌కోర్ అభిమానిని కాబట్టి నేను చిరంజీవిని కోపంగా ఉన్న మూడ్‌లో చూడలేను. ఇంకో విషయమేమిటంటే చిన్ని కృష్ణతో పనిచేస్తున్నప్పుడు చిన్ని కృష్ణ ఇంట్లో చిరంజీవి 'ఇంద్ర' మూవీలో ఫొటో ఉంటుంది. ఆ ఫొటోను గుర్తుంచుకొని మరి ప్రతిరోజు నేనే తుడిచే వాడిని' అని దర్శకుడు బాబి చిరుపై అభిమానాన్ని చాటుకున్నాడు.
ఇవి కూడా చదవండి : Akkineni's Heroes కు కలిసిరాని 2022.. పాపం ఇన్ని సమస్యలా?