ఆ ఊరికి శిక్షగా కొన్నాళ్లుగా మూసేసిన ఆలయాన్ని తెరిచిన నిఖిల్.. రియల్ హీరోగా ప్రశంసలు

by Sujitha Rachapalli |
ఆ ఊరికి శిక్షగా కొన్నాళ్లుగా మూసేసిన ఆలయాన్ని తెరిచిన నిఖిల్.. రియల్  హీరోగా ప్రశంసలు
X

దిశ, సినిమా : ' కార్తికేయ 2' తో అనుకోని రేంజ్ లో సక్సెస్ అందుకున్న హీరో నిఖిల్.. ప్రస్తుతం ' స్వయంభు ' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇందులో వారియర్ గా కనిపించబోతున్నాడు. అయితే నిజ జీవితంలోనూ దేవుడంటే అపారమైన భక్తి కలిగిన హీరో.. చీరాల గ్రామస్తులకు శిక్షగా కొన్ని ఏళ్లుగా మూసేసి ఉన్న ఆలయాన్ని తెరిపించాడు. ఆ గుడి అభివృద్ధి బాధ్యతలు తీసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేశాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. మంచి పని చేశారని కొనియాడుతున్నారు. ఇంత గొప్ప కార్యం చేసిన మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూస్తాడని అశీర్వదిస్తున్నారు.

కాగా నిఖిల్ కు రీసెంట్ గా కూతురు పుట్టిన విషయం తెలిసిందే. కాగా ఆమె భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు. కాగా ఈ హీరో ప్రస్తుతం 'స్వయంభు ' చిత్రంలో నటిస్తుండగా.. అదే లుక్ లో ఆలయాన్ని సందర్శించడం విశేషం. కాగా ఆయనపై పూల వర్షం కురిపిస్తూ గుడిలోకి స్వాగతించారు స్థానికులు.


Advertisement

Next Story

Most Viewed