హీరో చేతన్ మద్దినేని బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ!

by Hajipasha |   ( Updated:2023-01-29 14:31:56.0  )
హీరో చేతన్ మద్దినేని బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ!
X

దిశ, సినిమా: ప్రముఖ నటుడు, దర్శకుడు చేతన్ మద్దినేని జనవరి 29న తన బర్త్ డే సందర్భంగా కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కొవిడ్ వల్ల రెండేళ్లుగా సినిమాకు దూరమైన ఆయన.. మళ్లీ ప్రేక్షకులు తన సినిమాను థియేటర్స్‌లో చూస్తూ ఎంజాయ్ చేసే అనుభూతిని ఆస్వాదించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. 'ఈ టూ ఇయర్స్ గ్యాప్‌లో లాస్ ఏంజిల్స్‌లో ఉన్న 'లీస్ట్ ట్రాస్ బర్గ్ అనే ఇనిస్టిట్యూట్‌లో మెథడ్ యాక్టింగ్ నేర్చుకున్నా. 'ఫస్ట్ ర్యాంక్ రాజు' తర్వాత చాలా కథలు వింటున్నా. ఇటీవల గోపీ మోహన్‌ చెప్పిన ఒక స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యాను. ఈ కథ నచ్చి నేనే సొంతంగా సినిమా నిర్మిస్తున్నా. సాయి కిషోర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. యాభై శాతం పూర్తి అయిన ఈ సినిమాను పోలాండ్‌లో షూట్ చేశాం. రెడీ, ఢీ, చిరునవ్వుతో సినిమాల తరహాలో ఉండబోతోంది. గోపీ సుందర్ సంగీత దర్శకత్వంలో మూడు పాటలు చిత్రీకరించాం. హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం' అన్నాడు.

READ MORE

Crazy update on Pawan Kalyan-Sujeeth movie :అభిమానులకు గుడ్‌ న్యూస్

Advertisement

Next Story