- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
‘నరుడి బ్రతుకు నటన’ నుంచి చెప్పలేని అల్లరేదో.. ఈ మెలోడీ సాంగ్ ఎలా ఉందంటే?
దిశ, సినిమా: శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నరుడి బ్రతుకు నటన’. డైరెక్టర్ రిషికేశ్వర్ యోగి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బొరెడ్డి, డా. సింధు రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్లు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. అంతే కాకుండా విడుదలకు ముందే ఈ చిత్రం దాదాపు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. కేరళలోని అందమైన ప్రాంతాల్లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ‘నరుడి బ్రతుకు నటన’ నుంచి ఓ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘చెప్పలేని అల్లరేదో’ అంటూ సాగే ఈ పాట ట్యూన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఎంతో వినసొంపుగా ఉన్న ఈ పాట లిరికల్ వీడియో, అందులో చూపించిన విజువల్స్ మరింత హైలెట్ అవుతున్నాయి.