Rajamouli డైరెక్షన్‌లో Chandrayaan 3.. ఆ స్టార్ యాక్టరే హీరో..?

by Anjali |   ( Updated:2023-08-25 16:29:36.0  )
Rajamouli  డైరెక్షన్‌లో Chandrayaan 3.. ఆ స్టార్ యాక్టరే హీరో..?
X

దిశ, వెబ్‌డెస్క్: సరికొత్త రికార్డు సృష్టించిన చంద్రయాన్ 3 గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మారుమోగిపోతుంది. ప్రతీ ఒక్కరూ ఇండియా సాధించిన ఘనతకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సక్సెస్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు బయోపిక్ సినిమాలుగా తెరకెక్కి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎంతో మంది జీవితాలకు ఆదర్శంగా నిలిచాయి. కాగా జనాలు.. ఇస్త్రో శాస్త్రవేత్తలు సాధించిన విజయాన్ని కూడా చిత్రంగా మలచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్టోరీతో బయోపిక్ సినిమా తీయాలని కొంతమంది నెటిజన్లు నెట్టింట డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలోనే చూడాలని ఉందంటూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ‘మిషన్ మంగల్, రామసేతు, ఓమైగాడ్, కేసరి లాంటి బయోపిక్ చిత్రాల్లో నటించిన అక్షయ్ కుమారే ఈ సినిమా చేస్తే సూపర్ హిట్ అవుతుందని.. బయోపిక్, ఎక్స్‌పెర్మెంటల్ సినిమాలు చేయాలంటే ఎవ్వరైనా ఈ హీరో తర్వాతనే’ అంటూ ప్రేక్షకులు ఆశపడుతున్నారు. భారతీయుల్లో ఎంతగానో సంతోషాన్ని నింపిన ఈ స్టోరీతో సినిమా తెరకెక్కనుందా? లేదో ? చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి : న్యూ పార్లమెంట్‌ భవన్‌లో ప్రదర్శితమైన తొలి సినిమా.. మరో రెండు రోజులపాటు..

Advertisement

Next Story

Most Viewed