చైతన్య- శోభిత ఎంగేజ్‌మెంట్.. మా రిలేషన్‌లో నేను ఎటువంటి తప్పు చేయలేదంటూ సమంత సంచలన కామెంట్స్

by Kavitha |
చైతన్య- శోభిత ఎంగేజ్‌మెంట్.. మా రిలేషన్‌లో నేను ఎటువంటి తప్పు చేయలేదంటూ సమంత సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని.. నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. అయితే సమంత విడాకుల తర్వాత మయోసైటీస్ బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘తండేల్’ అనే మూవీతో బిజీబిజీగా ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళతో లవ్‌లో ఉన్నారనే ఓ పుకారు నెట్టింట షికారు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తాజాగా చైతూ, శోభితా ఇద్దరు.. హైదరాబాద్‌లోని తన నివాసంలో నిశ్చితార్థం చేసుకొని షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున వారిద్దరీ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేస్తూ X వేదికగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే అప్పట్లో శోభితతో నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు యూరప్ ట్రిప్‌కు వెళ్లారు. అక్కడ ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడికి వీరిద్దరూ కలిసి దర్శనం ఇచ్చారు. దీంతో అప్పట్లో వీరు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఆ సమయంలో సమంత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగా నా రిలేషన్‌లో తాను ఎటువంటి తప్పు చేయలేదని ఆమె ప్రకటించారు. అంటే చైతన్య వల్లే విడాకులు తీసుకున్నట్లు ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు సమంత కామెంట్స్‌ను నిజం చేస్తూ శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్నాడు. దీంతో గతంలో సమంత చేసిన కామెంట్స్ నిజమేనని ఫ్యాన్స్ చైతన్యను ఏకిపారేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed