నాగ చైతన్య Vs సమంత.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాటల యుద్ధం

by Anjali |   ( Updated:2023-04-19 10:03:11.0  )
నాగ చైతన్య Vs సమంత.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాటల యుద్ధం
X

దిశ, సినిమా: నాగ చైతన్య, సమంత విడిపోవడం ఇరువురి అభిమానులను కలిచివేసింది. వారు విడిపోవడానికి గల కారణం ఏమిటో తెలియక ఇరువురి అభిమానులు తలలు పట్టుకున్నారు. అయితే తాజాగా సామ్-చై ఫ్యాన్స్ నెట్టింట గొడవపడుతున్నారు. దీనికి కారణం ‘శాకుంతలం’ మూవీ. ఎందుకంటే నాగ చైతన్య లాస్ట్ టైం నటించిన ‘థాంక్యూ’ సినిమా భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ ఫ్లాప్‌గా నిలిచింది.

ఈ సమయంలో సమంత అభిమానులు చైతును దారుణంగా ట్రోల్ చేశారు. మూవీ ఫలితం కంటే ఆ ట్రోల్స్ చై ఫ్యాన్స్‌ను ఎక్కువగా బాధించాయి. ఇప్పుడు చైతు ఫ్యాన్స్‌కు అవకాశం వచ్చింది. ‘శాకుంతలం’ మూవీ ఘోర పరాజయాన్ని సంబరాలు చేసుకుంటున్నారు. ‘రూ.50 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ‘శాకుంతలం’ తొలి వారంలో ఔట్ అయింది. పెట్టుబడిలో సగం కూడా సంపాదించలేకపోయింది’ అంటూ సామ్ మూవీపై మీమ్స్‌తో పగతీర్చుకుంటున్నారు.

Read more:

‘మోస్ట్ సెక్సీయెస్ట్’.. రిషబ్ లవర్‌పై కన్నేసిన జడేజా

Advertisement

Next Story