పాటలతో సహా 'Pathaan' సినిమాలో మార్పులు చేయాల్సిందే: సెన్సార్ బోర్డ్

by sudharani |   ( Updated:2022-12-29 09:41:31.0  )
పాటలతో సహా Pathaan సినిమాలో మార్పులు చేయాల్సిందే: సెన్సార్ బోర్డ్
X

దిశ, సినిమా: మూడేళ్లకు పైగా లాంగ్‌ గ్యాప్‌ తర్వాత బాలీవుడ్ స్టార్ షారుఖ్‌ ఖాన్ నుంచి వస్తున్న చిత్రం 'పఠాన్‌'. ఈ సినిమాలో జాన్ అబ్రహం, దీపికా పదుకొణె కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని వచ్చే సంవత్సరం జనవరి 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది మూవీ టీం. ఇందులో భాగంగా రిలీజ్ చేసిన 'బేషరమ్ రంగ్' సాంగ్ వివాదాస్పదం అయింది.

దీపిక కాషాయం రంగు బికినీలో కనిపించడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. పాటలోని కంటెంట్‌‌తో ఓ సమూహాన్ని కించపరిచిందని ఆరోపిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) చీఫ్ ప్రసూన్ జోషి మాట్లాడుతూ.. 'రాబోయే షారుఖ్ ఖాన్ 'పఠాన్' మూవీని CBFC మార్గదర్శకాల ప్రకారం పూర్తిగా, క్షుణ్ణంగా పరిశీలించబడింది. చిత్రం, అందులోని పాటల్లో మేము చెప్పిన మార్పులను అమలు చేయాలని కమిటీ 'పఠాన్' నిర్మాతలకు తెలియజేసింది' అని తెలిపారు.

Advertisement

Next Story