Dimple Hayathi కారు పార్కింగ్ కేసు హైకోర్టుకు నటి..

by GSrikanth |   ( Updated:2023-06-08 10:27:19.0  )
Dimple Hayathi కారు పార్కింగ్ కేసు హైకోర్టుకు నటి..
X

దిశ, డైనమిక్ బ్యూరో: కారు పార్కింగ్ కేసుపై సినీ నటి డింపుల్ హయాతీ హైకోర్టును ఆశ్రయించింది. జూబ్లీహిల్స్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ గురువారం హయాతీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన అధికారాన్ని ఉపయోగించి, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఐపీఎస్ రాహుల్ హెగ్డే కేసు పెట్టించారని డింపుల్ పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాకుండా ఫార్చ్యూనర్‌తో పోలిస్తే సైజులో చాలా చిన్నది, సున్నితంగా ఉండే బీఎండబ్ల్యూ కారు ఢీకొనడం వల్ల.. దాని కంటే బలమైన, బరువైన పోలీసు వాహనం డ్యామేజ్ అయ్యే అవకాశం లేదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

నేడు విచారణలో భాగంగా వివాదం అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కారును ఢీ కొట్టిన ఫోటోలను కోర్టుకు చూపించారు. మరోవైపు పోలీస్‌స్టేషన్‌కి విక్టర్ డేవిడ్, డింపుల్‌ని పిలవడంలో పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పాటించడం లేదని డింపుల్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ఒకవేళ విచారణకు పిలవాలనుకుంటే 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే డింపుల్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారని పీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డేవిడ్ విక్టర్‌కి సైతం 41ఏ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశించింది.

Read more: Women’s safety.. ఆత్మరక్షణ కోసం మహిళలు వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులివే.

Advertisement

Next Story