ఇంతకంటే గర్వంగా ఎప్పుడూ ఉండలేదు.. షనయాపై అనిల్ కపూర్ ప్రశంసలు

by Prasanna |   ( Updated:2023-07-19 08:36:21.0  )
ఇంతకంటే గర్వంగా ఎప్పుడూ ఉండలేదు.. షనయాపై అనిల్ కపూర్ ప్రశంసలు
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘వృషభ’లో తన తమ్ముడి కూతురు షనయా కపూర్ అవకాశం దక్కించుకోవడంపై నటుడు అనిల్ కపూర్ గర్వంగా ఫీల్ అవుతున్నాడు. మోహన్ లాల్ హీరోగా పాన్ ఇండియా లెవల్లో రాబోతున్న ఈ సినిమాలో తెలుగు సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మోహన్ లాల్ కొడుకుగా కనిపించనుండగా రోషన్‌కు జోడిగా షనయాను ఎంచుకున్నారు మేకర్స్. అయితే తాజాగా దీనిపై స్పందించిన అనిల్ కపూర్.. ‘ఎవరూ ఊహించన రీతిలో షనయా కెరీర్ మలుపు తిరిగింది. ఒకరకంగా మరెవరికి దక్కని అవకాశం. ప్రారంభం కూడా. మేము చాలా సంతోషిస్తున్నాం. తప్పకుండా నీ కలలు నిజమవుతున్నాయని మేము మనస్పూర్తిగా నమ్ముతున్నాం. నిన్ను, నీ ప్రతిభను చూసి మేము గర్వపడుతున్నాం’ అంటూ కూతురిపై ప్రశంసలు కురిపించాడు. ఇక షనయా కపూర్ నటుడు సంజయ్ కపూర్ కూతురు.

Read More: బ్రా అందాలు ఒలకబోస్తున్న రూహి సింగ్.. ఫొటోల కోసం ఎగబడిన నెటిజన్లు..

Advertisement

Next Story