ఐఫా అవార్డు ఇస్తామని పిలిచి అవమానించారు బాధేస్తోంది.. డైరెక్టర్ ఎమోషనల్ నోట్

by Hamsa |
ఐఫా అవార్డు ఇస్తామని పిలిచి అవమానించారు బాధేస్తోంది.. డైరెక్టర్ ఎమోషనల్ నోట్
X

దిశ, సినిమా: సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా వేడుకలు ఈ ఏడాది అబుదాబిలో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీకి చెందిన బెస్ట్ చిత్రాలకు, ఉత్తమ నటీనటులకు అవార్డులు అందజేశారు. అయితే కన్నడ డైరెక్టర్ హేమంత్ రావు తనను ఈవెంట్‌కు పిలిచి ఐఫా అవార్డు ఇవ్వకుండా అవమానించారు అని సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. మీ సినిమాకు అవార్డు వచ్చిందని పిలిచి ఇవ్వకుండా ఈవెంట్ ముగించేశారని ఫైర్ అయ్యాడు. ఈ విషయంపై ఆయన రియాక్ట్ అవుతూ ‘‘ఐఫా అవార్డ్స్ నిర్వాహకులు మాకు ఫోన్ చేసి మీ సినిమాకు అవార్డు ఇస్తున్నాము అని చెప్పారు. మీ మూవీ సంగీత దర్శకుడు చరణ్‌ రాజ్‌తో కలిసి అబుదాబి వచ్చేందుకు ఫ్లైట్‌ ఏర్పాటు చేశామంటూ ఫోన్‌ చేశారు. దీంతో మేము అక్కడికి వెళ్లాము.

కానీ టీవీలో చూపించినంత అద్భుతంగా అవార్డు కార్యక్రమం జరగలేదు. ఈ IIFA అవార్డు నిర్వాహకులు ముందుగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమకు అవార్డులు ఇచ్చి, ఆ తర్వాత మన కన్నడ చిత్రాలకు అవార్డులు ఇస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు కార్యక్రమం పూర్తయింది. కన్నడ విషయానికి వస్తే ‘కాటేరా’ సినిమాకి అవార్డు వచ్చింది. దీని తర్వాత మా చిత్రం ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారా అని నేను, మా సంగీత దర్శకుడు చరణ్ రాజ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. కానీ అప్పటికే ఆ కార్యక్రమం పూర్తయింది.

అవార్డు ఇవ్వకుండానే కార్యక్రమం ముగించడంతో నేను చాలా ఆశ్చర్యపోయాను. అయినా కూడా శని, ఆదివారాలు దుబాయ్‌లోనే ఉండిపోయాం. ఐఫా అవార్డ్స్ నిర్వాహకులు కానీ, కార్యక్రమ బాధ్యులు కానీ మా వద్దకు వచ్చి తప్పు జరిగిందనే ప్రస్తావన కూడా తీసుకురాలేదు. బహుశా ఈ విషయాన్ని గ్రహించడానికి వాళ్ళకు టైమ్ పట్టిందేమో. అయితే మా సినిమాకు అవార్డు రాలేదని మేము బాధ పడలేదు. నేనెప్పుడూ అవార్డుల కోసం ఏ చిత్రం చేయలేదు. సినీ ప్రేక్షకుల స్పందనే నాకు పెద్ద అవార్డు అనుకున్నాను. కానీ నా సమయాన్ని వృధా చేశారని మరింత బాధిస్తోంది” అని రాసుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed