- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRO V/S MRO పవన్‌పై కొత్త సినిమా తీస్తున్నట్టు ప్రకటించించి మంత్రి అంబటి
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రో’ చిత్రంలో తనను పోలిన క్యారెక్టర్ పెట్టి, శునకానందం పొందుతున్నాడని పవన్‌పై ఫైర్ అయిన రాంబాబు.. తాజాగా పవన్‌పై సినిమా చేయటానికి కథను, టైటిల్‌ను రెడీ చేశానని మరోసారి ఆయన మీద సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తీయబోయే చిత్రం పేరు మ్రో. ఆ పేరు పెట్టడానికి కారణం కూడా ఉంది. మ్యారేజెస్, రిలేషన్స్-అఫెండర్ ఈ రెండు కలిపి మ్రో అని పెట్టే ఆలోచన ఉంది.
‘‘ఓ మంచి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న చిన్న ఫ్యామిలీలో ముగ్గురు బ్రదర్స్ ఉంటారు. వారిలో పెద్దవారు ఇద్దరు అద్భుతమైన విజయాలు సాధించి సెలబ్రిటీలుగా మంచి స్థాయిలో ఉంటారు. కానీ.. మూడో వ్యక్తి మాత్రం ఎక్కడికెళ్లినా ఊగిపోతూ ఉపన్యాసాలు ఇస్తుంటాడు. ఆ మూడో వ్యక్తి పెళ్లిళ్ల గురించి మేం తీయబోయే సినిమాలో చూపిస్తాం. క్లైమాక్స్‌లో మాత్రం మహిళా లోకం మెచ్చుకునే గుణపాఠం ఒకటి చూపిస్తాం” అంటూ అంబటి పవన్ కల్యాణ్‌పై సెటైర్స్ వేశారు. ప్రస్తుతం మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.