పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ‘BRO’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

by sudharani |   ( Updated:2023-07-19 11:52:54.0  )
పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ‘BRO’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో సినిమా ట్రైలర్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. జూలై 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ డేట్ ముందుగా జూలై 28న అనుకున్నా.. పోస్ట్ పోన్ అయ్యే చాన్స్ ఉన్నట్లు సమాచారం. అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేయడంలో కూడా క్లారిటీ లేదని తెలుస్తోంది.

‘వినోదయ సిత్తం’ రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాలో పవన్ దేవుడిగా కనిపించబోతుండగా.. బంధాల్లో చిక్కుకుని చనిపోయిన ఓ సగటు వ్యక్తిగా తేజ్ కనిపించబోతున్నాడు. ఈ క్రమంలో దేవుడు, సామాన్య మానవుడి మధ్య తలెత్తే సన్నివేశాలు అనూహ్యంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ అందించే డైలాగ్స్ హైలెట్ కానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed