Pawan Kalyan 'BRO' మూవీ రివ్యూ.. ఫ్యాన్స్ కు పూనకలేనా? (వీడియో)

by samatah |   ( Updated:2023-07-28 12:42:36.0  )
Pawan Kalyan BRO మూవీ రివ్యూ.. ఫ్యాన్స్ కు పూనకలేనా? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న బ్రో మూవీ విడుదలైంది. తమిళంలో ఘన విజయం అందుకున్న వినోదయ సీతమ్ అనే సినిమాను రిమేక్‌గా బ్రో.. దీ అవతార్ అంటూ తెలుగులో సముద్రఖని దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. `భీమ్లా నాయక్‌`వంటి హిట్ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తోన్న చిత్రమిది. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తో వస్తుందీ మూవీ. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ మరో హీరోగా నటిస్తుండటం ఈ చిత్రం స్పెషల్‌.ఇక ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని జూలై 28న అంటే ఈరోజు వరల్డ్ వైడ్‌గా విడుదల అవుతోంది. అయితే ఇప్పటికే పలు దేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీవ్యూస్ పడ్డాయి. దీంతో ఈ మూవీ ఎలా ఉంది. ఇది తెలుగు వారిని ఏ మేరకు ఆకట్టుకోగలదు వంటి అంశాలను సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా చర్చిస్తున్నారు.కాగా, ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.

ఒరిజినల్‌తో పోల్చితే చాలా మార్పులు చేశారని తెలుస్తోంది. ఒరిజినల్‌లో పెళ్లై ఓ 50 ఏళ్ల వ్యక్తి జీవితంలోని సమస్యలను చర్చిస్తే.. ఇక్కడ అప్పుడే పెళ్లైన ఓ యువకుడి జీవితంలో జరిగిన సంఘటనలను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో డైలాగ్స్‌తో పాటు పవన్, సాయిధరమ్ తేజ్‌లు తమ యాక్టింగ్ అండ్ స్టైల్‌తో అదరగొట్టారు.

కథలోకి వెళ్లితే.. సాయియిధరమ్‌ తేజ్‌ తండ్రి చనిపోవడంతో కార్పొరేట్‌ కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడు. బిజీ లైఫ్‌ని లీడ్‌ చేస్తుంటాడు. ఫ్యామిలీ, లవర్‌ కూడా టైమ్‌ కేటాయించలేకపోతుంటాడు. ఇంతలో యాక్సిడెంట్ అవుతుంది. అందులో చనిపోతాడు. అప్పుడు టైమ్‌(పవన్‌) ఎంట్రీ ఇస్తాడు. తమ బాధ్యతలు పుల్‌ఫిల్‌ చేసేందుకు కొంత టైమ్‌ కావాలని రిక్వెస్ట్ చేయగా, మళ్లీ పునర్జన్మనిస్తాడు టైమ్‌. అలా మళ్లీ బతికిన సాయిధరమ్‌ తేజ్‌కి ఎదురైన అనుభావాలేంటి? ఆయన చూసిన అసలైన జీవితం ఏంటి? జీవితంలో ఏం తెలుసుకున్నాడనేది ఈ సినిమా కథ.

Also Read: నేడు డైరెక్టర్ Krishna Vamsi పుట్టిన రోజు

సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. స్టోరి లైన్ చాలా ఆసక్తికరంగా ఉందంట.ఎమోషన్ సైడ్‌ ప్రయారిటీ ఎక్కువగా ఉందని, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్రాణమని, ఫ్యాన్స్ ని అలరించే సీన్లుసాగుతూనే మరోవైపు డివోషనల్‌ టచ్‌ ఉందట. రెండింటిని బ్యాలెన్స్ చేసినట్టు చెబుతున్నారు. థమన్‌ బీజీఎం హైలైట్‌ అంటున్నారు. డైలాగులు, స్క్రీన్‌ ప్లే రేసీగా ఉందంటున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కాంబో సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మంచి హ్యూమర్‌ని పండిస్తాయనట. పవన్‌ కళ్యాణ్‌ పాపులర్‌ సాంగ్స్ అన్నింటిని ఇందులో మిక్స్ చేశారట. అది ఫ్యాన్స్ కి ఊగిపోయేలా చేస్తాయని ఓవర్సీస్ ఆడియెన్స్ చెబుతున్నారు. ఫస్ట్ ఆఫ్ సరదాగా సాగుతుందని, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిపోయిందంటున్నారు ప్రేక్షకులు. ఓవరాల్‌గా చూస్తే సినిమా సూపర్‌గా ఉందంట.


Advertisement

Next Story