భారీ కలెక్షన్లతో రికార్డులు తిరగరాసిన Brahmastra

by sudharani |   ( Updated:2022-09-10 07:29:00.0  )
భారీ కలెక్షన్లతో రికార్డులు తిరగరాసిన Brahmastra
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకు ఆయాన్ దర్శకత్వం వహించారు. గ్రాండీయర్‌గా రూపొందిన 'బ్రహ్మాస్త్ర' ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రహ్మాస్త్ర సినిమా తొలిరోజే అన్ని భాషల్లో కలుపుకుని రూ.36 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన్నట్లు ప్రముఖ ట్రేడ్ అనాలిస్ట్ రమేష్ బాలా తెలిపారు. హిందీ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు వసూలు ఒరిజినల్ చిత్రంగా రికార్డులు సృష్టించినట్లు ఆయన తెలిపాడు. దీంతో గత కొన్ని రోజులుగా వరుస ప్లాఫ్స్ చూస్తున్న బాలీవుడ్.. ''బ్రహ్మాస్త్ర'' సినిమాతో కాస్త ఊరట దక్కిందని తెలుస్తుంది. కాగా.. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనిరాయ్‌ ఈ సినిమాల్లో కీలక పాత్ర పోషించారు.

Also Read : 'Brahmastra ఎఫెక్ట్: డైరెక్టర్, కరణ్‌పై Kangana Ranaut సంచలన వ్యాఖ్యలు



Advertisement

Next Story