Brahmamudi: కళ్యాణ్ బాగా గుర్తొస్తున్నాడంటూ ఏడ్చిన అప్పూ

by Prasanna |   ( Updated:2023-10-18 09:17:10.0  )
Brahmamudi: కళ్యాణ్ బాగా గుర్తొస్తున్నాడంటూ ఏడ్చిన అప్పూ
X

దిశ, వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

మనసు మన మాట వినదు.. అప్పూ.. మన కళ్లకు నిజం తెలిసే లోపు.. మనల్ని అగ్ని గుండంలోకి తోసేస్తుంది. చివరికి ఇలా బాధని మిగులుస్తుంది’ అంటూ పెద్దమ్మ అంటుంది. నేనంటే సరే.. ఏం పట్టనట్లుగా తిరుగుతాను. కానీ వాడు మంచిగా కవితలు రాస్తాడు. నిద్ర లేస్తే మనసు, హృదయం అంటూ మంచి మంచి మాటలు చెబుతాడు. అలాంటిది వాడికి నా మనసు అర్ధం కాలేదా పెద్దమ్మా అంటూ అప్పూ ఏడుస్తూనే ఉంటుంది. అన్నపూర్ణకు ఏం చెప్పాలో తెలియక మౌనంగానే ఉంటుంది.

మళ్లీ అప్పూ ఎమోషనల్ గా మాట్లాడటం మొదలు పెడుతుంది.. ‘వాడు అందరి మగాళ్లులా కాదు వేరు అనుకున్నా.. కానీ వాడు కూడా నా ఫ్యాంటూ షర్ట్ మీద కామెంట్స్ చేస్తుండు. నేను ఇలా ఉండాలని కోరుకున్నానా? అసువంటి మగాళ్లలో నేను ఒక మగాడిగా ఇంటికి తోడుగా అండగా ఉండాలనే కదా ఇలా మారాను. దానిలో తప్పేముంది పెద్దమ్మా?’ అంటుంది అప్పూ. ఆ సీన్ చాలా ఎమోvషనల్‌ గా సాగింది.

Advertisement

Next Story

Most Viewed