Brahmamudi September 08 Episode : పాల పాఠం.. పూల పాఠం నేర్పిస్తానంటూ.. పాల గ్లాస్ తో రాజ్ గదిలోకి వెళ్లిన కావ్య

by Prasanna |   ( Updated:2023-09-08 08:23:14.0  )
Brahmamudi September 08 Episode :  పాల పాఠం.. పూల పాఠం నేర్పిస్తానంటూ.. పాల గ్లాస్ తో రాజ్ గదిలోకి వెళ్లిన కావ్య
X

దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

తల్లో మల్లెపూలు.. చేతిలో పాల గ్లాస్ చూసి షాక్ అవుతాడు రాజ్. కావ్య.. లోపలికి వచ్చి.. తలుపు గడియ పెట్టడంతో.. రాజ్ కంగారు పడిపోతాడు. ‘ఏయ్ ఏంటిదీ’ అని అడుగుతాడు. ఇది తలుపు.. అది గడియా? అని కావ్య అంటుంది.కావ్య సిగ్గుపడిపోతూ.. రాజ్పక్కన కూర్చొని వచ్చి.. ‘ఇవి మల్లెపూలు.. ఇవి పాలు’ అని అంటుంది. అవన్ని తెలుసు.. కానీ ‘ఇవన్నీ నాకు ఎందుకు’? అంటున్నా.. సరే కోప పడకండి.. ఇక్కడ కూర్చోండి.. మీకు అన్ని పాఠాలు నేర్పిస్తా’ అని కావ్య అంటుంది.‘ఏయ్.. ఏం నేర్పిస్తావ్? అని రాజ్ అంటే.. అబ్బా కూర్చోండి అని బలవంతంగా రాజ్‌ని మంచంపై కూర్చోబెడుతుంది కావ్య. ' పాల పాఠం.. పూల పాఠం నేర్పిస్తాను రండీ.. పాలు వద్దా? పాలూ.. ఆవు పాలూ.. బాదం పాలు.. మురిపాలు.. సగపాలు’ అని పాలపాఠం చెప్తుంటుంది కావ్య. సరే అయితే పూల పాఠం చెప్పనా? అని అంటూ రాజ్ ని ఒక ఆట ఆటాడుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed