Brahmamudi : చెప్పకపోతే నా మీద ఒట్టే వదిన అంటూ.. కావ్యను ఇరకాటంలో పెట్టిన కళ్యాణ్

by Prasanna |   ( Updated:2024-01-24 07:23:26.0  )
Brahmamudi : చెప్పకపోతే నా మీద ఒట్టే వదిన అంటూ..  కావ్యను ఇరకాటంలో పెట్టిన కళ్యాణ్
X

దిశ, సినిమా: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

‘టాబ్లెట్స్ వేసుకున్నావా.. అని రాజ్ అడుగుతాడు. ‘లేదు.. వేసుకుంటాను’ అని కావ్య అంటుంది. ‘మరి మంచులో ఎందుకు కూర్చున్నావ్.. వెళ్లి పడుకోవచ్చు కదా.. అని రాజ్ అంటాడు. ‘సరే’ అని కావ్య పైకి లేస్తుంది. ‘నువ్వు ఫోన్ చేసినప్పుడు’ అంటూ రాజ్ మాట పూర్తిగా మాట్లాడకుండా.. ఆగిపోతాడు రాజ్.. ‘ఆఫీస్‌లో ఉన్నారు.. అర్జెంట్ మీటింగ్‌లో ఉన్నారు అంతే కదా.. మీరు చెప్పబోయేది.. అని కావ్య అంటుంది. ‘అవును..నేను బిజీగానే ఉన్నాను’ అని రాజ్ అంటాడు. ‘మీరు ఎంత బిజీగా ఉంటారో నాకు బాగా తెలుసు.. నేను అర్థం చేసుకున్నాను’ అని కావ్య అంటుంది. మన రాజ్‌కి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా ఉంటాడు. కొంత సేపటికి కావ్య.. పైన బాల్కనీలో బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి కళ్యాణ్ వెళ్తాడు. ‘వదినా..ఏంటి ఇక్కడ నిలుచున్నారు.

మీకు ఆరోగ్యం బాగోలేకపోతే నాకు చెప్పొచ్చు కదా వదినా.. నేను హాస్పిటల్ కి తీసుకువెళ్లే వాడ్ని కదా అని కళ్యాణ్ అంటాడు. ‘ ఆసుపత్రికి వెళ్లకుండానే .. నయం అయ్యింది కవిగారు’ అంటుంది కావ్య. ‘ఏంటి వదినా.. ఏం అంటున్నారు?’ అంటాడు కళ్యాణ్. ‘అంటే ఇందాక పెద్ద అత్తయ్య ఏదో పని చెబితే చిన్న అత్తయ్య ఏదో అన్నారంట కదా.. మా అక్క చెప్పింది. నన్ను ఆసుపత్రికి తీసుకుని వెళ్తానంటే నన్ను కూడా ఏదొకటి అనేవాళ్లు’ అంటుంది కావ్య బాధగా.

మీరు ఎందుకు బాధలో ఉన్నారో నాకు చెప్పండి వదిన.. నా సలహా ఇస్తాను.. నా సాయం మీకు అవసరం కావచ్చు. ఆ తర్వాత మీ గుండెల్లోంచి భారం దిగిపోవచ్చు.. అని కళ్యాణ్ అంటాడు కళ్యాణ్. కావ్య వెళ్లిపోబోతుంది. ‘చెప్పకపోతే నా మీద ఒట్టే వదినా’ అంటూ కావ్య చేతిని తన తల మీద పెట్టుకుని వదిలిపెట్టడు.ఇక్కడితో ఈ సీను ముగుస్తుంది.

Advertisement

Next Story