Brahmamudi : రాజ్ ని బుట్టలో పడేసిన శ్వేత.. బాధలో కావ్య

by Prasanna |   ( Updated:2024-01-20 08:04:01.0  )
Brahmamudi : రాజ్ ని  బుట్టలో పడేసిన శ్వేత.. బాధలో కావ్య
X

దిశ, సినిమా: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

రాజ్ మా ఇంట్లోకి ఎవరో వచ్చారు.. నేను ఇప్పటికి అదే చెబుతున్నా.. చూపించలేనంత మాత్రాన్న నిజం అబద్దం అయిపోదు..? నా చుట్టూ ఏదో జరుగుతుంది రాజ్.. కానీ అది నాకు తెలియడం లేదు.. ఒక్కోసారి పిచ్చెక్కుతుంది నాకు’ అంటూ ఏడుస్తూ చెబుతుంది శ్వేత. ‘ఓకే ఓకే.. నువ్వు భయ పడకు.. నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నాను.. ఇక్కడికి ఎవరో వచ్చారు. కనుక్కుందాం.. ముందు నువ్వు కంగారు పడకు' అంటూ ధైర్యం చెబుతాడు రాజ్. ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది రాజ్.. అని శ్వేత ఏడుస్తూ చెబుతుంది.

ఇంకో వైపు కావ్య ‘పరిస్థితులు నా పై పగబట్టినట్లు చేస్తున్నాయి.. ఎంత దూరం‌గా వెళ్లిపోదాం అనుకుంటున్నా నాకు కుదరడం లేదు’ అని అంటుంది. ఆ మాటలకు రాజ్ మరింత ధైర్యం చెప్పడానికి శ్వేత చేతులు పట్టుకుంటాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా.. కిటికీలోంచి.. ఆ ఆగంతకుడు వీడియో తీస్తాడు. కావ్య ఫోన్‌కి.. ఆ వీడియోని పంపిస్తాడు. అది చూసి కావ్య షాక్ అయిపోతుంది. గతంలో రాజ్, శ్వేతలు కలిసి తిరిగిన సీన్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ.. అల్లాడిపోతూ ఆ రాత్రి అంతా ఏడుస్తూనే ఉంటుంది కావ్య. కానీ నిజానికి రాజ్ శ్రీరామ చంద్రుడే.. శ్వేత భర్త నుంచి కాపాడటానికి ఇలా స్నేహంగా ఉంటున్నాడు. ఇది కావ్య ఎప్పుడు తెలుసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement

Next Story