Sri Devi: శ్రీదేవి లిప్ కిస్ ఫొటో వైరల్..

by Prasanna |
Sri Devi: శ్రీదేవి లిప్ కిస్ ఫొటో వైరల్..
X

దిశ, సినిమా : అతిలోక సుందరి శ్రీదేవి అందం, అభినయం గురించి భర్త బోనీ కపూర్ పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. ఓ తమిళ్ ఫిల్మ్‌లో తనను చూసినప్పుడు ఒక నిర్మాతగా తనకు కావాల్సింది అలాంటి అమ్మాయే అనుకున్నానని, రిషి కపూర్‌ హీరోగా తను హీరోయిన్‌గా ప్లాన్ చేసుకున్నానని చెప్పాడు. తర్వాత ఆమెను కలిసేందుకు చెన్నయ్ వెళ్లగా.. తను మరో మూవీ కోసం సింగపూర్‌లో ఉన్నట్లు తెలియడంతో వెనక్కి వచ్చేశాడు. కానీ తను మాత్రం మైండ్‌లో నుంచి పోలేదన్నాడు. అందుకే ఇండియాకు రిటర్న్ వచ్చాక.. వెంటనే కలిసేందుకు వెళ్లానని, తొలిసారి ఆమెను కలవడం కల నిజమైన క్షణం లాంటిదని చెప్పుకొచ్చాడు. ఆమె ఇంట్రోవర్ట్ కావడం.. స్ట్రేంజర్స్‌తో త్వరగా కలవకపోవడం.. బ్రోకెన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో పలికే పదాలు.. శ్రీదేవి గురించి మరింత తెలుసుకోవాలనే కుతూహలాన్ని పెంచాయని తెలిపాడు. కాగా ఆమె ఐదో వర్ధంతి సందర్భంగా... 'షై, ఇంట్రోవర్ట్.. ఆమెతో ప్రేమలో పడినప్పుడు' అనే ట్యాగ్‌లైన్‌తో 'శ్రీదేవితో బోనీ లిప్ కిస్ ఫొటో'ను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed