Hero Yash : యష్, షారుఖ్ ఖాన్ కాంబోలో మూవీ నా ..? మ్యాటర్ ఏంటంటే

by Kavitha |   ( Updated:2024-01-30 10:05:33.0  )
Hero Yash : యష్, షారుఖ్ ఖాన్ కాంబోలో మూవీ నా ..? మ్యాటర్ ఏంటంటే
X

దిశ, సినిమా: కన్నడ ఇండస్ట్రీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టిన మూవీ ‘కేజీఎఫ్’. ఈ సినిమా హిట్ తో హీరో యష్ తిరుగులేని ఫాలోయింగ్.. క్రేజ్ ని దక్కించుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో యష్ నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా ఈ మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దీంతో పాటుగా యష్ బాలీవుడ్ లో నితీష్‌తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమాలో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో తాజాగా యష్ ఇప్పుడు మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విషయం ఏంటంటే యష్ కొత్త ప్రాజెక్ట్ కోసం షారుక్ ఖాన్ యాజమాన్యంలోని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో చర్చలు జరుపుతున్నారట. ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని టాక్. అంతే కాదు ఈ మూవీలో షారుఖ్ ఖాన్ కూడా ఉన్నాడు అనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే రూమర్స్ వినపడుతున్నాయి.

Advertisement

Next Story