‘Double iSmart’ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-29 05:38:12.0  )
‘Double iSmart’ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చి ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రామ్ మాస్ లుక్, డైలాగ్ డెలివరీ, సినిమాలోని పాటలకు యూత్ ఫిదా అయ్యారు. తాజాగా ఇదే కాంబోలో ఈ మూవీకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. బాలీవుడ్ విలక్షణ నటుడు, హీరో సంజయ్ దత్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించనున్నారు. తాజాగా సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్ ను మూవీ టీం విడుదల చేసింది.

‘బిగ్ బుల్’ క్యారెక్టర్‌లో డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్ నటించనున్నారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంజయ్ దత్ వెల్లడించారు. మాస్ డైరక్టర్ పూరి జగన్నాథ్, యంగ్, ఎనర్జిటిక్ రామ్ పోతినేనితో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని సంజయ్ దత్ ట్వీట్ లో తెలిపారు. టీమ్ తో కలిసి త్వరలో పనిచేసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని సంజయ్ దత్ ట్వీట్ లో రాసుకొచ్చారు. కాగా ఈ సినిమా 2024 మార్చి 8 న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ సినిమాకు చార్మి, పూరి జగన్నాథ్‌లు ప్రొడ్యూసర్లుగా వ్యవరిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: ‘BRO’ మిక్స్‌డ్ టాక్ రావడమేంటి.. రిపోర్టర్‌పై ఫైర్ అయిన Sai Dharam Tej & డైరెక్టర్..

Advertisement

Next Story