టవల్ కోసం తల్లిని తిట్టిన బాలీవుడ్ హీరోయిన్!

by Dishaweb |   ( Updated:2023-06-05 12:56:37.0  )
టవల్ కోసం తల్లిని తిట్టిన బాలీవుడ్ హీరోయిన్!
X

దిశ, సినిమా: లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘జరా హాట్కే జరా బచ్కే’. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించగా ఇనాముల్హాక్, సుస్మితా ముఖర్జీ, నీరజ్ సూద్ సహాయ పాత్రల్లో నటించారు. జూన్ 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ విజయాన్ని అందుకుంది. ఒక్కరోజులో రూ.5.49 కోట్లు వసూలు చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్కీ కౌశల్.. సారా పిసినారి స్వభావాన్ని బయట పెట్టాడు. ‘సారా తన తల్లి అమృత మేడమ్‌ని తిట్టడం నేను చూశాను. ఏమైంది ఎందుకు తిడుతున్నావు? అని అడిగితే.. సారా బదులిస్తూ ‘మా అమ్మకు తెలివి లేదు. ఆమె రూ.1600 విలువైన టవల్‌ని కొనుగోలు చేసింది’ అని చెప్పి మల్లి తన తల్లిని తిట్టడం మొదలెట్టింది’ అంటూ చెప్పుకొచ్చాడు .

Read more:

శర్వానంద్ పెళ్లి పందిట్లో గొడవ.. మందుపార్టీ కారణమా?

శర్వానంద్ అన్ని కోట్ల కట్నం తీసుకున్నాడా!

Advertisement

Next Story