'Chandramukhi-2'లో కంగనా రానౌత్ !

by Prasanna |   ( Updated:2022-12-11 05:52:45.0  )
Chandramukhi-2లో కంగనా రానౌత్ !
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎదైన హిట్టయిన సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుందంటే.. ప్రేక్షకులలో భారీ అంచనాలుంటున్నాయి . ఇలాంటి అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం 'చంద్రముఖి-2'. 2005లో వచ్చిన 'చంద్రముఖి' సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సంచలన విజయం సాధించింది. దక్షిణాది ప్రేక్షకులకు సరికొత్త హర్రర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. ఇందులో లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా 'చంద్రముఖి-2'లో మూవీ‌లో నటిస్తున్నట్లు మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. కాగా అతి త్వరలో ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా రానున్నట్లు తెలుస్తోంది.

Read More....

" HIT 2 " సినిమా 8 రోజుల కలెక్షన్స్ !

Advertisement

Next Story