- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నా ప్రాణం తీసుకోండి సల్మాన్ భాయ్‌ను చంపొద్దంటూ దండం పెట్టి మరీ వేడుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ! (వీడియో)
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని బాంద్రాలోని సల్మాన్ నివాసంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇంటి చుట్టూ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అనుమోల్ బిష్టోయ్ తన సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన కాల్పుల సంఘటనపై బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది.
ఇందులో ఆమె మాట్లాడుతూ ‘‘ ఇప్పటి వరకు జరిగింది సరైనది కాదు. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి. నేను ఒక సాధారణ మహిళను కాబట్టి నా ప్రాణం పోయినా నష్టం ఏం లేదు. కానీ సల్మాన్ ఖాన్ లెజెండ్. ఇప్పటిదాకా జరిగిన ఇన్సిడెంట్ చూసి అందరూ భయపడుతున్నారు. కానీ నా వద్దకు ఎవరూ రారని నాకు తెలుసు. నేను దేవుడికి తప్ప మరెవరికి భయపడను. మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. సల్మాన్ భాయ్‌ని చంపొద్దు. అతను ఎంత మంచి మనిషో మీకు కూడా తెలుసు అలాంటి వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు. నా తల్లి క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ఆపరేషన్ కోసం సల్మాన్ ఖాన్ డబ్బులు ఇచ్చాడు.
అలాగే నేను కరోనా సమయంలో డబ్బు లేక ఇబ్బంది పడితే.. ఆయన సహాయం చేసి అండగా నిలిచారు. పేదలకు సాయం చేయడం కోసమే ఆయన సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన వల్ల ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి మంచి వ్యక్తిని చంపడం వల్ల మీరేం పొందుతారు? దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాను. సల్మాన్ ఖాన్‌ను వదిలేయండి’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు సల్మాన్‌ను వదిలేసి రాఖీసావంత్‌ను పట్టుకెళ్లండి అంటూ కామెంట్లు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.