చిన్న పిల్లలకు లిప్ లాక్ కిస్‌లు ఇస్తూ రెచ్చి పోయిన నటి.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

by sudharani |   ( Updated:2023-03-22 15:15:52.0  )
చిన్న పిల్లలకు లిప్ లాక్ కిస్‌లు ఇస్తూ రెచ్చి పోయిన నటి.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ప్రతి తల్లి తన బిడ్డలకు ముద్దులు పెట్టడం సర్వసాధారణం. తన పిల్లల మీద ఉన్న ప్రేమను బట్టి ఒక్కో సమయంలో లిప్ కిస్‌లు కూడా ఇస్తుంది తల్లి. అయితే బాలీవుడ్ నటి ఛవి మిట్టల్ కూడా అదే విధంగా తన పిల్లలకు లిప్ కిస్‌లు ఇస్తూ.. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దానికి నెటిజన్లు ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. ‘‘ఈ వయసు నుండే పిల్లలకు ఏం నేర్పిస్తున్నావు.. పిల్లలకు మీ బ్యాక్టీరియాను పంచుతున్నారా’’ అంటూ సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. అంతే కాకుండా ఆమె షేర్ చేసిన ఫొటోలకు కొంతమంది ప్రముఖులు కూడా స్పందిస్తూ ఛవి మిట్టల్‌ను తప్పుబట్టారు.

అయితే ఈ కామెంట్స్‌కు రియాక్ట్ అయిన నటి.. తమ పిల్లలకు లిప్ కిస్‌లు పెట్టిన మరికొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘ఒక తల్లి పిల్లలపై చూపించే ప్రేమకి ఇలాంటి కామెంట్స్ వస్తాయని నేను అస్సలు అనుకోలేదు. నా పిల్లలపై నాకు అమితమైన ప్రేమ ఉంది. అది ఎలా చూపించాలో నాకు తెలియదు. దానిని ఇలా ముద్దులు, హగ్‌ల రూపంలో నాకున్న ప్రేమను చూపిస్తున్న. నాకు సపోర్ట్ చేసిన వాళ్లందరి థాంక్యూ. అలాగే నాపై ట్రోల్స్ చేసేవారు తమ పిల్లలపై ప్రేమను ఏ విధంగా చూపిస్తున్నారో నాకు తెలియపరచండి’’ అంటూ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

వెడ్డింగ్ గౌనులో మైమరపించిన సెలీనా.. చేసుకునేవాడు అదృష్టవంతుడేనట

Advertisement

Next Story