తల్లి కాబోతున్న బోల్డ్ బ్యూటీ.. బేబీ బంప్ ఫొటో వైరల్

by Hamsa |   ( Updated:2022-08-16 08:24:46.0  )
తల్లి కాబోతున్న బోల్డ్ బ్యూటీ.. బేబీ బంప్ ఫొటో వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కపుల్స్ బిపాసా బసు- కరణ్ సింగ్ గ్రోవర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. 2016లో పెళ్లిచేసుకున్న జంట.. త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 'ఒకప్పుడు ఒక్కరిగా మొదలైన మేము తర్వాత ఇద్దరిగా, ఇప్పుడు ముగ్గురిగా అయ్యాము' అంటూ సోషల్ మీడియా వేదికగా బేబీ బంప్ ఫొటోలను షేర్ చేశారు. 'కొత్త సమయం. కొత్త దశ. మా జీవితంలోకి మరొక ప్రత్యేకమైన కొత్త కాంతి ప్రతిజ్వలించింది. ఇంతకాలం ఒకరికోరిగా బ్రతికాం.

కానీ, ఇప్పటినుంచి మా ఇద్దరిలో మరింత ప్రేమ, అప్యాయత పెంపొందించుకోవాలి. మా ప్రేమకు ప్రతిరూపాన్ని ఈ సృష్టి ఇంత త్వరగా ప్రసాదిస్తుందనుకోలేదు. మీ అందరి ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చెబుతున్న శుభాకాంక్షలకు ఎల్లప్పుడూ మాలో భాగమవుతాయి. మా పాప పేరు దుర్గ దుర్గ' అంటూ బిపాస తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అక్కడ షేవ్ చేసుకున్న సింగర్.. ఫొటోలు చూసి బూతులు మొదలు

Advertisement

Next Story

Most Viewed