‘బిగ్ బాస్: ఓటీటీ 2’ విన్నర్‏గా యూట్యూబర్.. జనాల్లో ఉత్కంఠ రేపిన గ్రాండ్ ఫినాలే

by samatah |   ( Updated:2023-08-15 07:30:33.0  )
‘బిగ్ బాస్: ఓటీటీ 2’ విన్నర్‏గా యూట్యూబర్.. జనాల్లో ఉత్కంఠ రేపిన గ్రాండ్ ఫినాలే
X

దిశ, సినిమా : హిందీ ‘బిగ్ బాస్: ఓటీటీ సీజన్ 2’ విజేతను ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ యాప్ జియో సినిమా వేదికగా ప్రసారం అయిన ఈ షో గ్రాండ్ ఫినాలే ఆగస్ట్ 14న రాత్రి ఘనంగా జరగగా.. ఈసారి ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌ విజేతగా నిలిచాడు. దీంతో అతనికి బిగ్‌బాస్ ట్రోఫీతోపాటు రూ.25 లక్షల నగదు అందించారు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా దాదాపు 2 నెలల పాటు స్ట్రీమింగ్ అయిన ఈ షోలో మొత్తం 13 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా చివరికి యూట్యూబర్ ఎల్విష్ యాదవ్, ఫుక్రా ఇన్సాన్ ఫేమ్ అభిషేక్ మల్హాన్, బీహార్‌కి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మనీషా రాణి, బాబికా ధూర్వే, బాలీవుడ్ నటి పూజా భట్ ఫైనల్‌కి చేరుకున్నారు. అయితే ఫైనలిస్టులలో ఎల్విష్ యాదవ్ ముందంజలో ఉండి ఈ సీజన్ టైటిల్‌ను గెలుచుకోగా సల్మాన్ ఖాన్ తన చేతులతో బిగ్ బాస్ ఓటీటీ ట్రోఫీని అందజేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Read More: సినిమా ఒక వల్గర్ బిజినెస్ అయిపోయింది.. సెక్స్ లేని కథే లేదు

Advertisement

Next Story

Most Viewed