‘బిగ్‌బాస్’ హరితేజ విడాకులు.. ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన నటి పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-09-30 06:05:37.0  )
‘బిగ్‌బాస్’ హరితేజ విడాకులు.. ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన నటి పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి హరితేజ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ షోలో పాల్గొని ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. యాంకర్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసి సీరియల్ నటిగా క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం ఈ భామ.. ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తుంది. కూతురును తన తల్లి దగ్గర వదిలి.. సింగిల్ గా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

తాజాగా, హరితేజ చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయి అభిమానులతో ముచ్చటించింది. చిట్ చాట్ సెషన్ ప్రారంభించింది. అందులో ఒక నెటిజన్.. భర్త దీపక్ తో విడాకులు తీసుకున్నారా.. ? అన్న ప్రశ్నకు హరితేజ.. ‘‘ నాలుగు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే..’’ అంటూ తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ విడాకుల న్యూస్ నిజం కాదని క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం హరితేజ్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.



Advertisement

Next Story