ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

by sudharani |   ( Updated:2023-08-14 11:03:05.0  )
ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఎంత అందంగా ఉన్నావే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ జియా శంకర్. రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్‌‌లతో కలిసి మరాఠి సినిమా ‘వేద్‌’లో చివరిసారిగా నటించింది. అంతేకాకుండా జియా లవ్ బై ఛాన్స్, ప్యార్ తునే క్యా కియా, మేరీ హనికరక్ బీవీ, కాటేలాల్ అండ్ సన్స్, లాల్ ఇష్క్, పిశాచిని, గుడ్‌నైట్ ఇండియా వంటి ఎన్నో స్టార్ టీవీ షోలలో కూడా అలరించింది. ఇక బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ హూస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ ఓటీటీ-2 సీజన్ రన్ అవుతోన్న సంగతి తెలిసిందే. జియా ఇందులో కంటెస్ట్‌గా పాల్గొంది. ఇటీవలే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ షో నుంచి బయటికొచ్చాక ఈ నటి యస్‌యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్5 మోడల్ కారును కొనుగోలు చేసింది. ఈ కారు ధర దాదాపు రూ. 1.3 కోట్ల వరకు ఉంటుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. జియా తన న్యూ కారు ముందు ఫొటోలకు ఫోజులిస్తూ హ్యాపీగా కనిపించింది. అనంతరం అక్కడున్న వారందరికీ స్వీట్లు కూడా పంచుతున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: ‘విరూపాక్ష’కు సీక్వెల్ వచ్చేస్తోంది!

Advertisement

Next Story