బిగ్‌బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానంటూ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
బిగ్‌బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ బిగ్ బాస్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న వారిలో కిరణ్ రాథోడ్ ఒకరు. ఈ అమ్మడు సీజన్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ విన్నర్ కాలేకపోయింది. ఇక బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా అయి పలు పోస్టులతో సంచలనం సృష్టిస్తోంది. అలాగే తన హాట్ హాట్ ఫొటోలతో తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది. ఒక్కోసారి తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

ఈ క్రమంలో.. తాజాగా, కిరణ్ రాథోడ్ ఏకంగా రూ. 15 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘మే 13న నా సినిమాతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లాల్సి ఉంది.. మా టీమ్ అంతా అక్కడే ఉన్నారు. స్క్రీనింగ్, లాంఛింగ్ ఇప్పటికే పూర్తయ్యాయి.. వీసా కోసం నెల రోజులుగా ఎదురు చూస్తున్నాను.. 15 లక్షల నష్టం వాటిల్లింది. నా హోటల్ బుకింగ్ అంతా అయిపోయింది. కానీ వీసా మాత్రం రాలేదు. నేను ఇప్పటికీ నా పాస్‌పోర్ట్‌ని ట్రేస్ చేయలేకపోయాను. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నాను. నాకు సమాధానం కావాలి’’ అని రాసుకొచ్చింది. అలాగే పేపర్స్ కూడా షేర్ చేసింది.

Advertisement

Next Story