జైలు నుంచి బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్​ రిలీజ్

by Satheesh |   ( Updated:2023-12-23 15:07:52.0  )
జైలు నుంచి బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్​ రిలీజ్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బిగ్​బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ ​శనివారం చెంచల్​గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తరువాత నేరుగా స్వగ్రామానికి వెళ్లిపోయాడు. బిగ్​బాస్​ సీజన్-​7 ఫైనల్​ రోజున జూబ్లీహిల్స్​ అన్నపూర్ణ స్టూడియో వద్ద పల్లవి ప్రశాంత్​ అభిమానులు విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సులతో పాటు బిగ్​బాస్​ కంటెస్టెంట్లకు సంబంధించిన కార్లపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. ఇలాంటి సంఘటనలు జరగవచ్చన్న​అనుమానంతో స్టూడియో వెనక వైపు నుంచి పంపించినా పల్లవి ప్రశాంత్​ ముందు గేటు వైపు వచ్చి రెచ్చగొట్టేలా వ్యవహరించటం వల్లనే ఈ ఘటనలు జరిగాయని జూబ్లీహిల్స్​పోలీసులు కేసులు నమోదు చేశారు.

పల్లవి ప్రశాంత్​ అతని సోదరునితో పాటు మరో 14 మందిని అరెస్టు చేశారు. కాగా, ఈ కేసులో శుక్రవారం నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్ అతని సోదరునితో పాటు మరో ఇద్దరికి బెయిల్​ మంజూరు చేసింది. ప్రతినెలా 1, 16వ తేదీల్లో జూబ్లీహిల్స్​ పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ షరతు విధించింది. శనివారం బెయిల్​ పేపర్లను చెంచల్​గూడ జైలుకు తీసుకొచ్చిన పల్లవి ప్రశాంత్ లాయర్లు​ వాటిని జైలు అధికారులకు సమర్పించారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్​ అతని సోదరుడు, మరో ఇద్దరు విడుదలయ్యారు. కాగా, పల్లవి ప్రశాంత్‌ను చూడటానికి అతని అభిమానులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు వచ్చారు.

Read More..

వాళ్లపై పరువు నష్టం దావా వేయబోతున్న ప్రశాంత్.. ఏకంగా 50 మంది లాయర్లతో కేసు గట్టిగానే..!

Advertisement

Next Story