BREAKING: బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్

by Satheesh |   ( Updated:2023-12-20 14:06:54.0  )
BREAKING: బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్- 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవ కేసులో పోలీసులు ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. గజ్వేల్ మండలం కొల్గూరులో జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇటీవల ముగిసిన బిగ్ బాస్- 7 సీజన్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ నిలవగా.. రన్నరప్‌గా మరో కంటెస్టెంట్ అమర్‌దీప్ నిలిచిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్-7 టైటిల్‌ను ప్రశాంత్ అందుకున్నాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌గా ప్రశాంత్ నిలవడంతో అతడిని అభినందించేందుకు ఆదివారం పెద్ద ఎత్తున ప్రశాంత్ అభిమానులు జూబ్లీహిల్స్ రోడ్ నెం 5లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చారు.

ఇదే సమయంలో అటు రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ ఫ్యాన్స్ కూడా అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చారు. ఈ క్రమంలో ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానులు మధ్య తీవ్ర వాగాద్వం, ఘర్షణ జరిగింది. ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన దాడుల్లో పలువురు పోలీసులకు గాయాలు కాగా, పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. దీంతో పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్టూడియో వద్ద నుండి వెళ్లిపోవాలని సూచించినప్పటికీ ప్రశాంత్ అభిమానులు రోడ్లపై హంగామా చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రశాంత్‌ను పోలీసులు ఏ1గా చేర్చారు. ప్రశాంత్‌తో పాటు అతడి తమ్ముడు, మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు అయ్యింది. మంగళవారం ప్రశాంత్ తమ్ముడిని, మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇవాళ ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.



Advertisement

Next Story