‘రంగబలి’నుంచి బిగ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

by sudharani |   ( Updated:2023-05-11 14:02:54.0  )
‘రంగబలి’నుంచి బిగ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: నాగ శౌర్య, పవన్ బాసంశెట్టి కాంబోలో వస్తున్న చిత్రం ‘రంగబలి’. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వెలువడింది. ఈ మేరకు జూలై 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమాను విడుదలచేయబోతున్నట్లు చిత్రం బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాగ శౌర్య ట్రెండీ గెటప్‌‌లో అట్రాక్ట్ చేస్తున్నారు.

ఇక ఉగాది పండుగరోజు విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలో పల్లెటూరి నేపథ్యంలో సాగే కథతో రంగబలి ఫన్ రైడ్‌‌గా ఉండబోతున్నట్లు తెలుస్తుండగా సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. చివరగా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు చెప్పిన మేకర్స్ త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తామన్నారు. పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

ఓటీటీలోకి ‘భోళా’.. చూడాలంటే ఎంత చెల్లించాలో తెలుసా?

Advertisement

Next Story