‘ఇది క్లైమాక్స్ కాదు.. అంతకు మించి’.. ఉస్తాద్ నుంచి అదిరిపోయే అప్ డేట్

by Anjali |   ( Updated:2023-06-02 12:11:20.0  )
‘ఇది క్లైమాక్స్ కాదు.. అంతకు మించి’.. ఉస్తాద్ నుంచి అదిరిపోయే అప్ డేట్
X

దిశ, సినిమా: రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో మరో యాక్షన్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా అక్టోబర్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ‘#RAPO20’ పేరుతో తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్ డేట్ ఇచ్చాడు హీరో రామ్. ‘24 రోజులు కష్టపడి యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేశాం. ఇది క్లైమాక్స్ కాదు.. అంతకు మించి’ అంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతుండగా.. ‘టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారు. మరిన్ని అప్ డేట్స్ కావాలి’ అని కోరుతున్నారు ఫ్యాన్స్. ఇక టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల కథనాయికగా నటిస్తున్న ఈ సినిమా.. ఉస్తాద్‌కు తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

Read More: తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు: రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Advertisement

Next Story