అక్కినేని ఫ్యామిలీకి బిగ్ షాక్: స్టార్ డైరెక్టర్‌తో సమంత డేటింగ్.. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుందా పిక్స్ వైరల్?

by Anjali |   ( Updated:2024-08-16 06:20:03.0  )
అక్కినేని ఫ్యామిలీకి బిగ్ షాక్: స్టార్ డైరెక్టర్‌తో సమంత డేటింగ్.. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుందా పిక్స్ వైరల్?
X

దిశ, సినిమా: అతి తక్కువ సమయంలోనే అందం, అభినయం, నటన, అదిరిపోయే డ్యాన్స్‌తో స్టార్ డమ్ సంపాదించుకుంది హీరోయిన్ సమంత. ఈ అమ్మడు యాక్టింగ్‌కు టాలీవుడ్‌తో సహా తెలుగు ప్రేక్షకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తుంటారు. ‘‘అఆ, బ్రహ్మోత్సవం, రభస, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు, ఏమాయ చేశావే, మనం, ఈగ, మజిలీ, ఖుషి, రంగస్థలం’’ వంటి చిత్రాల్లో అగ్ర హీరోల సరసన అవకాశం కొట్టేసి.. ఆడియన్స్‌ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. సినిమాల్లో నటించే సమయంలోనే అక్కినేని హీరో నాగ చైతన్యతో స్నేహం చేసింది. ఈ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

కానీ నాగచైతన్య-సమంత అభిమానులకు షాక్ ఇచ్చేలా ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇకపోతే ఇటీవలే నాగ చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమంత కూడా అక్కినేని ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన షాకింగ్ న్యూస్ ఏంటంటే..? సమంత అండ్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించిన రాజు నిడుమోరు అనే డైరెక్టర్ ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

వీరిద్దరు చాలా ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నారని, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటించిన తర్వాతే అక్కినేని హీరో నాగ చైతన్యకు సామ్ డివోర్స్ ఇచ్చిందని జనాలు చర్చించుకుంటున్నారు. అయితే దర్శకుడు రాజుకు పెళ్లైంది. కానీ సామ్‌తో లవ్‌లో ఉన్నందున వైఫ్‌కు డివోర్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట. అంతేకాకుండా మరో విషయం ఏంటంటే.. సమంత బర్త్ డే సెలబ్రేషన్స్‌ కూడా ఈ డైరెక్టరే చాలా ఘనంగా నిర్వహించారట. మరీ ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ సామ్-రాజు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని.. అక్కినేని ఫ్యామిలీకి ఊహించని షాకిచ్చి, సరైన బుద్ధి చెప్పిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. వీరిద్దరికి సంబంధించిన పలు ఫొటోలు జనాలు నెట్టింట వైరల్ చేస్తున్నారు.

Advertisement

Next Story