ఆ క్షణం నా జీవితం ముగిసిందనుకున్నా.. విజయ్ యాక్సిడెంట్‌పై ఫాతిమా

by Anjali |   ( Updated:2023-05-17 10:16:08.0  )
ఆ క్షణం నా జీవితం ముగిసిందనుకున్నా.. విజయ్ యాక్సిడెంట్‌పై ఫాతిమా
X

దిశ, సినిమా: ‘బిచ్చగాడు’ సినిమాతో హీరో విజయ్ ఆంటోని మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ కూడా రెడీ అయింది. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బిచ్చగాడు 2’ మే 19న రాబోతోంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో విజయ్ ఆంటోని భార్య ఫాతిమా ఎమోషనల్ అయింది. ఫాతిమా మాట్లాడుతూ ‘మామూలుగా అయితే చెన్నైలో ఉంటే ఫోన్ చేయడు.

అలాంటిది నాకు సడెన్‌గా కాల్ వచ్చింది. ‘సార్‌కు యాక్సిడెంట్ అయింది. స్పృహలో కూడా లేడని చెప్పి వెంటనే కట్ చేశారు. ఏం జరిగిందో అర్థం కాలేదు మళ్లీ మళ్లీ ఫోన్ చేశా. విజయ్‌ని అప్పుడు హాస్పిటల్‌కు తీసుకెళ్లే హడావిడిలో ఉన్నారు. ఆ క్షణం నా జీవితం ఇక ముగిసింది అనుకున్నా. కానీ అభిమానుల ప్రేమ, ఆశీస్సులతో నేను ధైర్యంగా నిలబడగలిగాను. ఆయన ప్రాణాలతో మళ్ళీ తిరిగి రావడానికి కారణం మీ ప్రేమ’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read..

తరుణ్‌పై రూమర్స్ చూసి తట్టుకోలేకపోయా: రోజా

Advertisement

Next Story