ఆ సంఘటన నన్ను చాలా బాధించింది: భూమిక ఎమెషనల్

by Harish |   ( Updated:2023-04-26 14:33:10.0  )
ఆ సంఘటన నన్ను చాలా బాధించింది: భూమిక ఎమెషనల్
X

దిశ, సినిమా: సీనియర్ నటి భూమిక చావ్లా తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. గతంలో ఏడాదిపాటు ఎదురుచూసిన ఓ సినిమా నుంచి తనను అనూహ్యంగా తప్పించడంతో చాలా బాధపడ్డానని తాజా సమావేశంలో తెలిపింది. ‘నేను పాత్రల విషయంలో సెలక్టివ్‌గా ఉండేదాన్ని. ‘తేరేనామ్’ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. ‘జబ్ వి మెట్’ కు సంతకం చేసిన తర్వాత పలు కారణాల వల్ల నిర్మాణ సంస్థ మారింది. దీంతో టైటిల్ కూడా మార్చేసిన మేకర్స్.. కథానాయికను కూడా మార్చారు. అలా ఆ సినిమా అవకాశం చేజారిపోయింది. ఆ సమయంలో ఒత్తిడికి లోనవుతూ చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆ సినిమా చేసుంటే నా కెరీర్‌‌కు బిగ్ టర్న్ లభించేది. నిజానికి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక జూదం లాంటిది. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం’ అంటూ పలు విషయాలపై ప్రస్తావించింది. ఇక 2007 ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ఆ మూవీలో షాహిద్ కపూర్ సరసన కరీనా కపూర్ నటించింది.

Also Read: పేరెంట్స్ విడాకులపై అలయ షాకింగ్ కామెంట్స్.. అవగాహన లేదంటూ



Advertisement

Next Story