చిరు పెద్ద కూతురు-ఉదయ్ కిరణ్‌ల గురించి బయటపడ్డ అసలు నిజాలు!

by Anjali |   ( Updated:2023-06-27 08:59:03.0  )
చిరు పెద్ద కూతురు-ఉదయ్ కిరణ్‌ల గురించి బయటపడ్డ అసలు నిజాలు!
X

దిశ, సినిమా: గతంలో చిరంజీవి కూతురు సుస్మితకు, హీరో ఉదయ్ కిరణ్‌కు నిశ్చితార్థం జరగాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీని తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ పరంగా ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి తాజాగా జర్నలిస్ట్ భరద్వాజ్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘ఉదయ్ కిరణ్ మరణం ఇప్పటికీ ఎంతోమంది అభిమానులను బాధ పెడుతోంది. నా ఇంటర్వూలో చిరంజీవి కూతురు సుస్మిత ఇష్టమైన హీరో ఎవరని అడిగితే ఉదయ్ కిరణ్ పేరు చెప్పింది. అప్పటికే ఈ ఇద్దరి మ్యారేజ్ గురించి ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయి.

‘ఇంద్ర’ మూవీ శత దినోత్సవ వేడుకలకు ఉదయ్ హాజరు కావడానికి కారణం పెళ్లి ఫిక్స్ కావడమే. ఆ ఆనందంలో ఉదయ్ మాకు పార్టీ కూడా ఇచ్చారు. కానీ ఏమీ జరిగిందో తెలియదు. సడన్‌గా మహిళా జర్నలిస్ట్‌తో ఉదయ్ ప్రేమ వల్ల, సుస్మితతో నిశ్చితార్థం ఆగిపోయింది. దీని తర్వాత ఉదయ్ కిరణ్ మూవీస్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అందరూ మెగా ఫ్యామిలీనే అతని తొక్కేసిందని ప్రచారం జరిగింది. చెప్పాలంటే ఉదయ్ కిరణ్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగారు. తనకు చిరంజీవి ఆరాధ్య నటుడు. జీవితంలో ఉదయ్ కిరణ్ సక్సెస్‌ను తీసుకున్నంత ఈజీగా ఫెయిల్యూర్‌ను తట్టుకోలేకపోయాడు. అందుకే ఈ నష్టం జరిగింది’ అని భరద్వాజ్ వివరించారు.

Read More..

Ram Charan : జులై నుంచి షూటింగ్ బరిలో దిగనున్న రామ్ చరణ్?

తెలుగు స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా

Advertisement

Next Story