8 భాషల్లో రాబోతున్న నిహారిక వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ‘

by sudharani |   ( Updated:2024-09-06 16:04:11.0  )
8 భాషల్లో రాబోతున్న నిహారిక వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్  ఎప్పుడంటే?  ‘
X

దిశ, సినిమా: నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ ‘బెంచ్ లైఫ్’. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులను కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. ఇటీవల వచ్చిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ క్రమంలోనే తాజాగా ‘బెంచ్ లైఫ్’ సిరీస్ రిలీజ్ టైం అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ వెబ్ సిరీస్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 12 నుంచి తెలుగుతో పాటు దాదాపు ఏడు భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. కాగా.. ఇందులో రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, నయన్ సారిక, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Next Story