- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
ముందు ఫ్రెండ్షిప్ తర్వాత డేటింగ్ .. నివేదా పేతురాజ్ షాకింగ్ కామెంట్స్
![ముందు ఫ్రెండ్షిప్ తర్వాత డేటింగ్ .. నివేదా పేతురాజ్ షాకింగ్ కామెంట్స్ ముందు ఫ్రెండ్షిప్ తర్వాత డేటింగ్ .. నివేదా పేతురాజ్ షాకింగ్ కామెంట్స్](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348135-nivetha.webp)
దిశ, సినిమా: ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత మెంటల్ మదిలో, బ్రోచేవారేవరురా, పాగల్, అలా వైకుంఠపురంలో వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ మెప్పిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటుంది. అదేవిధంగా మరోవైపు బ్యాడ్మింటన్ గేమ్‌లో ఆడుతూ కప్పులు కొడుతుంది. ఇక సినిమాలతో అంత గుర్తింపు రాకపోవడంతో వెబ్ సిరీస్ వైపు మళ్ళింది. ఈ క్రమంలోనే ‘పరువు’ అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. గతంలోకి వెళితే మీకు మీరు ఎలాంటి సలహా ఇచ్చుకుంటారు అని ఇంటర్వ్యూలో నివేతాని అడిగితే.. డేటింగ్ చేసే ముందు ఆ అబ్బాయి గురించి బాగా తెలుసుకోవాలి. ముందు ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత డేటింగ్ చేయాలి అని తెలిపింది.
దీంతో.. అంటే మీకు పాస్ట్‌లో బ్యాడ్ అనుభవం ఉన్నట్టు ఉంది అని అడగగా.. నివేదా ఈ రోజుల్లో అందరూ లవ్, డేటింగ్ చేస్తున్నారు. సింగిల్‌గా ఉండటానికి భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు అని తెలిపింది. దీంతో గతంలో నివేదా లవ్ ఫెయిల్యూర్ అని, ఎవరో ఆ అబ్బాయి అని కామెంట్ చేస్తున్నారు.