‘బెదురులంక 2012’ ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్‍చరణ్

by Prasanna |   ( Updated:2023-10-12 07:24:35.0  )
‘బెదురులంక 2012’ ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్‍చరణ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోయిన్‍ నేహాశెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 25న రిలీజ్‌కానుంది. రీసెంట్‌గా మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ తేజ్ చేతుల మీదుగా సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయించారు. ట్రైలర్ ఎలా ఉందంటే.. ‘2012 డిసెంబర్ 21 ప్రపంచమంతా యుగాంతం వస్తుందని, ప్రళయం వస్తుందని భయపడిన రోజు. కానీ ఎక్కడా ఏం జరగలేదు. మా ఊర్లో తప్పా’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ఇక యుగాంతం అంశాన్ని ఉపయోగించుకుని ప్రజలను కొంతమంది మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం చుట్టూ కామెడీ సీన్లను దర్శకుడు తెరకెక్కించినట్టు ట్రైలర్‌లో తెలుస్తోంది.

Advertisement

Next Story