ఘనంగా బర్రెలక్క రెండో వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోస్

by Jakkula Samataha |   ( Updated:2024-03-29 07:37:03.0  )
ఘనంగా బర్రెలక్క రెండో వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోస్
X

దిశ, సినిమా : హాయ్ ఫ్రెండ్స్.. డిగ్రీలు, బీటెక్ చేసినా ఉద్యోగం రావడం లేదు, అందుకే బర్రెలు కాసుకుంటున్నానంటూ వీడియోతో సోషల్ మీడియాలో మంచి ఫేమస్ సంపాదించుకుని, బర్రెలక్కగా ఫేమస్ అయ్యింది కర్నె శీరిష. ఇక ఈమె ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వార్తల్లో నిలించి. ఇక అప్పటి నుంచి ఈమెకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతోంది.

ఇక శిరీష గతంలో ఓ యువకుడిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోగా, ఇప్పుడు మళ్లీ రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టబోతుంది. ఓ యువకుడిని ఈమె వివాహం చేసుకోబోతోంది. ఈ క్రమంలో శిరీష, పెళ్లి పత్రిక, ఫ్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలు, నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, తాజాగా శిరీష నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్లో గురువారం వివాహం చేసుకుంది. పెద్ద కొత్తపల్లి మండలానికి చెందిన వెంకటేశ్‌తో ఆమె మూడు ముళ్లు వేయించుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాట యూట్యూబ్ , సోషల్ మీడియా స్టార్లు పాల్గొని బర్రెలక్కను దీవించారు.

Read More..

సమంతతో విడిపోయినా.. నాగచైతన్య ఇంట్లో పదిలంగా ఉన్న సమంత గుర్తులు!

Advertisement

Next Story