ఐ లవ్ కేసీఆర్ అంటూ తారక్ ఫ్యాన్స్ ను గెలికిన బండ్లన్న..

by Hamsa |   ( Updated:2022-09-04 12:50:02.0  )
ఐ లవ్ కేసీఆర్ అంటూ తారక్ ఫ్యాన్స్ ను గెలికిన బండ్లన్న..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అంశాలపై స్పందిస్తూ.. ట్వీట్లు, పోస్టులు పెడుతుంటారు. ఇక తాజాగా, బండ్ల గణేష్ మరో హాట్ ఆంశంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. శుక్రవారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన 'బ్రహ్మస్ట్ర' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ గెస్ట్‌గా రావాల్సి ఉండగా.. పోలీసులు సెక్యూరిటీ ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో ఈ కార్యక్రమంను రద్దు చేశారు. దీనిపై బండ్ల గణేష్ స్పందిస్తూ '' ఐ లవ్ కేసిఆర్ సార్.. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను తారక్ గారు'' అంటూ ఎన్టీఆర్‌ ను ట్రాక్ చేసి ఓ ట్వీట్ చేశాడు. అది చూసిన తారక్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తూ తిట్టిపోస్తున్నారు.

Also Read : ఫ్యాన్స్‌కు పబ్లిక్‌గా క్షమాపణ చెప్పిన Jr.NTR

NTR vs KCR.. మధ్యలోకి దూరిన కళ్యాణ్ రామ్

Advertisement

Next Story