- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐ డోంట్ కేర్.. చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై సినీ హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అని వ్యాఖ్యానించారు. సినిమా వాళ్లు స్పందించపోయినా తాను పట్టించుకోనని, చంద్రబాబు అరెస్ట్‌పై తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తానని అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ నేతలతో బాలకృష్ణ అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ లేదన్నవారికి తామేంటో చూపిస్తామని, రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో తాము టచ్‌లో ఉన్నామని, చంద్రబాబు అరెస్ట్‌లో కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందో లేదో తెలియదని బాలయ్య అన్నారు. తాము అనవసరంగా ఎవరిపైనా నిందలు వేయమని తెలిపారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ నేతలతో బాలయ్య భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా చేపట్టాల్సిన ఆందోళనల గురించి నేతలతో చర్చించారు. అనంతరం బాలయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బాబు అరెస్ట్ అయి నెలగడుస్తున్నా తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఎవ్వరూ ఖండించలేదని,ఎన్నికలు త్వరలోనే ఉన్నందున ఓట్ల కోసం మూడ్రోజులుగా ఎన్టీఆర్ జపం చేస్తున్నారని, కానీ మనస్పూర్తిగా మాట్లాడటం లేదని మండిపడ్డారు. కొందరు రాజకీయ లబ్ధి, ఎలక్షన్స్ కోసం మాత్రమే ఇప్పుడు స్పందిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పార్టీకి తాను అండగా ఉన్నానని, కార్యకర్తల్లో ధైర్యం, పార్టీ బలోపేతం కోసం కంకణం కట్టుకున్నామన్నారు.
గత ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల్లో కాస్త భయం, స్థబ్తత ఉండిందని, దానిని తొలగించనున్నామన్నారు. రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అన్నారు. ఎన్నికల కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశామని, గురువారం నుంచి పార్టీ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయన్నారు. పొత్తుల విషయం చంద్రబాబు నిర్ణయిస్తారని, సూచనలతో పాటు రిపోర్టు అందజేస్తామన్నారు. తెలంగాణలో పేదలకు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని, వారి హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు. ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా పార్టీ పునర్వైభవం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఐటీ ఎంప్లాయీస్ అల్లాటప్పగా అల్లర్లు చేయరన్నారు. . ఏపీ, తెలంగాణతోపాటు ప్రపంచమంతా ఉన్న తెలుగువారంతా బాబు అరెస్టుపై స్పందిస్తూ ఖండిస్తున్నారన్నారు.