Nandamuri Balakrishna రీ రిలీజ్ కు సిద్ధమవుతోన్న బాలయ్య సినిమా..!

by Shiva |   ( Updated:2023-10-10 15:09:24.0  )
Nandamuri Balakrishna  రీ రిలీజ్ కు సిద్ధమవుతోన్న బాలయ్య సినిమా..!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అగ్ర కథానాయకుల సినిమాలు మళ్లీ రిలీజై ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ.. మంచి కలెక్షన్లను రాబడుతున్నాయి. అయితే, టాలీవుడ్ స్టార్ హీరో నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో "నరసింహ నాయుడు" ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్ కు సన్నద్దమవుతోంది. ఈ చిత్రంలో సిమ్రాన్, ప్రీతి జింగ్యాని, ఆశా షైనీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే.. నట సింహం బాలకృష్ణ నటించిన చెన్న కేశవ రెడ్డి సినిమా మళ్లీ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నరసింహ నాయుడు సినిమా జూన్ 10న రీ రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి మరి.

Advertisement

Next Story