- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైరలవుతోన్న బాలకృష్ణ వెడ్డింగ్ కార్డ్.. పెళ్లి ఎక్కడ జరిగిందంటే?
దిశ, సినిమా: నందమూరి తారక రామారావు నటవారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. ఈ హీరో నటన, డాన్స్‌తో టాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న ఈ హీరో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను, తర్వాత మాస్ ఆడియన్స్, ఆ తర్వాత ఫ్యాషన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. హైఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు బాలయ్య. ప్రస్తుతం ఈ హీరో కుమారుడు మోక్షజ్ఞను కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా బాలకృష్ణకు పెళ్లికి సంబంధించి నెట్టింట ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
ప్రముఖ బిజినెస్ మెన్ అయిన దేవులపల్లి సూర్యారావు కుమార్తెను బాలయ్య పెళ్లి చేసుకున్నారు. కార్డులో.. వీరి పెళ్లి 1982 డిసెంబరు 8 వ తారీకున బుధవారం తిరుపతిలోని కర్ణాటక మండపంలో జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే బాలయ్య పెళ్లి కుదిరిన సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారట. వసుంధర బంధువుల అమ్మాయేనని సమాచారం. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ పెళ్లి పత్రిక నందమూరి వారిది కాదు. వసుందరా దేవి పుట్టింటి వారి పెళ్లి కార్డ్ కావడం విశేషం.